Saif Ali Khan case : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (Mohammad Shariful Islam Shehzad) పోలీస్ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. షెహజాద్ పోలీస్ కస్టడీ (Police custody) శుక్రవారంతో ముగియడంతో బాంద్రా పోలీసులు అతడిని ముంబై కోర్టు (Mumbai Court) లో ప్రవేశపెట్టారు. నిందితుడి నుంచి మరిన్ని రాబట్టాల్సి ఉందని, కాబట్టి అతడి కస్టడీని మరో వారం రోజులు పొడిగించాలని కోరారు.
దాంతో కోర్టు అతడి పోలీస్ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది. ఈ నెల 29 వరకు నిందితుడి పోలీస్ కస్టడీని పొడిగిస్తున్నట్లు పేర్కొన్నది. కాగా ఈ నెల 16న బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫ్ ఇస్లాం సెహజాద్ దొంగతనం కోసం బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడ్డాడు. అదిచూసి సైఫ్ అలీఖాన్ అతడిని పట్టుకోగా చేతిలో ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ ఛాతీలో, వీపులో కత్తిగాట్లు పడ్డాయి. దాంతో సైఫ్ అతడిని విడిచిపెట్టాడు.
అనంతరం కుటుంబసభ్యులు సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ముందుగా వారం రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఆ పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో పొడిగింపు కోరుతూ ఇవాళ మరోసారి కోర్టులో హాజరుపర్చారు. దాంతో కోర్టు అతడి పోలీస్ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది. కాగా మహ్మద్ షరీఫ్ ఉల్ ఇస్లాం సెహజాద్ ఏడు నెలల క్రితమే మేఘాలయలోని డౌకీ నది దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. అతడు భారత్‌లో విజయ్దాసుగా పేరు మార్చుకుని నివసిస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | Actor Saif Ali Khan attack case | | Accused Mohammad Shariful Islam Shehzad sent to Police custody till 29th January. Visuals of him being brought to the Bandra Police Station in Mumbai. pic.twitter.com/ChJh7OcCff
— ANI (@ANI) January 24, 2025
Crime news | రాత్రంతా పరిచయస్తుడితో బయటికి.. తెల్లారి ఇంట్లో వాళ్లు తిడతారని..!
Crime news | అమానవీయం.. అప్పు చెల్లించలేదని మహిళను తీవ్రంగా కొట్టి.. గుండు గీసి..!
Virender Sehwag: విడాకులు తీసుకునే ఆలోచనలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ !
Earthquake | ఉత్తరకాశీని వణికించిన భూకంపం
Kamala Harris | భర్త వల్లే ఓడిపోయిందా.. కమల హారిస్ దంపతుల విడాకులు?