Crime news : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఓ మహిళపట్ల అమానవీయంగా వ్యవహరించారు. ఇంట్లో వంట చేసుకుంటున్న మహిళను బయటికి ఈడ్చుకొచ్చి మూకుమ్మడి దాడి చేశారు. అంతటితో ఆగక మరో అనాగరిక చర్యకు పాల్పడ్డారు. బలవంతంగా గుండు గీశారు. త్రిపుర రాష్ట్రం (Tripura state) సెపహిజాలా జిల్లా (Sepahijala district) లోని విశాల్‌గఢ్ (Bishalgarh) లోగల లాల్సింగ్మురా (Lalsinghmura) ఏరియాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లాల్సింగ్మురా ఏరియాకు చెందిన ఓ మహిళ స్వయం సహాయక సంఘం (Self Help Group) నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకుంది. ఆ డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె భర్త ఉద్యోగం పోయింది. దాంతో ఆ డబ్బును తిరిగి చెల్లించలేకపోయారు. దాంతో గ్రూపులోని మిగతా సభ్యులంతా ఆమెను డబ్బు తిరిగిచెల్లించాలని ఒత్తిడి చేశారు. కానీ ఆమె ప్రస్తుతం తాను చెల్లించే పరిస్థితిలో లేనని చెప్పింది.
ఈ క్రమంలో గురువారం ఉదయం స్వయం సహాయక సంఘంలోని మిగతా మహిళలంతా కలిసి అప్పు తీసుకున్న మహిళ ఇంటికి వెళ్లారు. కిచెన్‌లో వంట చేస్తున్న ఆమెను బయటికి ఈడ్చుకొచ్చారు. దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఇంటి ముందు కూర్చోబెట్టి ఆమెకు బలవంతంగా గుండుగీశారు. అప్పటికే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. దాడి విషయం తెలియగానే బాధితురాలిని వారి బారి నుంచి రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చామని, ఆమె నుంచి వివరాలు సేకరించి సుమోటోగా కేసు నమోదు చేశామని తెలిపారు.
Virender Sehwag: విడాకులు తీసుకునే ఆలోచనలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ !
Earthquake | ఉత్తరకాశీని వణికించిన భూకంపం
Kamala Harris | భర్త వల్లే ఓడిపోయిందా.. కమల హారిస్ దంపతుల విడాకులు?