Earthquake | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో భూకంపం (Earthquake) సంభవించింది. ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లాలో శుక్రవారం ఉదయం స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు నమోదయ్యారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. అయితే స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Also Read..
Saif Ali Khan | దాడి ఘటనపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన సైఫ్ అలీఖాన్.. ఏం చెప్పాడంటే..?
Hyderabad | టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు : వీడియో
Virender Sehwag: విడాకులు తీసుకునే ఆలోచనలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ !