Saif Ali Khan | గతవారం దుండగుడి దాడిలో గాయపడ్డ బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరగా.. ఆరు రోజుల చికిత్స అనంతరం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 16న జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
‘నేను, నా భార్య కరీనా కపూర్ 11వ అంతస్తులోని బెడ్రూమ్లో ఉన్నాం. ఆ సమయంలో చిన్న కుమారుడు జెహ్ కేర్‌టేకర్ ఎలియామా ఫిలిప్ గట్టిగా కేకలు వేసింది. దుండగుడు జెహ్ నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తిని చూపుతూ ఫిలిప్‌ను రూ.కోటి డిమాండ్ చేశాడు. దీంతో జెహ్ ఏడ్వడం మొదలు పెట్టాడు. ఫిలిప్ కేకలు విన్న నేను వెంటనే అక్కడికి వెళ్లి చూడగా.. ఆగంతకుడు, కేర్‌టేకర్ మధ్య గొడవ జరుగుతోంది. వెంటనే దుండగుడిని పట్టుకొనేందుకు ప్రయత్నం చేశా. ఈ క్రమంలో అతడు నా వీపు, మెడ, చేతులపై కత్తితో పొడిచాడు’ అని సైఫ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.
కాగా, ముంబై బాంద్రా ప్రాంతంలో ఈ నెల 16న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై తన ఇంట్లో ఓ దుండగడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి అనంతరం కుటుంబ సభ్యులు సైఫ్‌ను లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆరు రోజుల చికిత్ర తర్వాత ఈనెల 21న సైఫ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సైఫ్ నిజంగానే దాడికి గురయ్యారా?
అయితే, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ ఎంతో చలాకీగా నడుచుకుంటూ రావడం ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది. ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్‌పై దాడికి సంబంధించి ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఆయన అంత త్వరగా ఎలా కోలుకున్నారు, ఆపరేషన్ చేసిన తర్వాత అంత చలాకీగా ఎలా ఉన్నారు? తదితర ప్రశ్నలు తలెత్తుతుండగా పోలీసులు పట్టుకున్న నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ అసలు నిందితుడు కాదని, సైఫ్ బంగ్లా సీసీ టీవీలో కన్పించిన నిందితుడికి, ఇతనికి అసలు పోలికలే లేవని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడు అన్ని అంతస్తులు పైకి ఎక్కి సైఫ్ ఫ్లాట్‌నే ఎందుకు ఎంచుకున్నాడు. నిందితుడిని కొట్టి గదిలో బంధించినట్టు తొలుత ఇంట్లో వారు ఎందుకు చెప్పలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిందితుడు షరీఫుల్ తండ్రి కూడా సీసీ టీవీ ఫుటేజ్‌లో కన్పిస్తున్న వ్యక్తికి తన కుమారుడికి పోలికలే లేవని చెప్పాడు. అయితే ఈ వాదనలను ఫోరెన్సిక్ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ దవాఖాన నుంచి బయటకు నడచి వచ్చిన తీరుని గమనించి తాను ఆశ్చర్యపోయానని.. ‘ఆయన నిజంగానే దాడికి గురయ్యరా లేక నటిస్తున్నారా’ అని అనిపించిందని మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణె గురువారం వ్యాఖ్యానించారు.
Also Read..
“Sara Ali khan | తండ్రి సైఫ్ అలీ ఖాన్‌ను పరామర్శించిన సారా అలీ ఖాన్”
“Nitesh Rane: సైఫ్‌ను నిజంగా పొడిచారా?.. లేక నటిస్తున్నాడా?.. మహారాష్ట్ర మంత్రి అనుమానాలు”
“Saif Ali Khan | సైఫ్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్‌కు రూ.లక్ష రివార్డు ప్రకటించిన సింగర్”
“Saif Ali Khan | చిక్కుల్లో సైఫ్ వేల కోట్ల ఆస్తులు.. ప్రభుత్వ పరం కానున్న 15 వేల కోట్ల ఆస్తులు?”