ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి సంబంధించి ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఆయన అంత త్వరగా ఎలా కోలుకున్నారు, ఆపరేషన్ చేసిన తర్వాత అంత చలాకీగా ఎలా ఉన్నారు? తదితర ప్రశ్నలు తలెత్తుతుండగా పోలీసులు పట్టుకున్న నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ అసలు నిందితుడు కాదని, సైఫ్ బంగ్లా సీసీ టీవీలో కన్పించిన నిందితుడికి, ఇతనికి అసలు పోలికలే లేవని పలువురు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడు అన్ని అంతస్తులు పైకి ఎక్కి సైఫ్ ఫ్లాట్‌నే ఎందుకు ఎంచుకున్నాడు. నిందితుడిని కొట్టి గదిలో బంధించినట్టు తొలుత ఇంట్లో వారు ఎందుకు చెప్పలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిందితుడు షరీఫుల్ తండ్రి కూడా సీసీ టీవీ ఫుటేజ్‌లో కన్పిస్తున్న వ్యక్తికి తన కుమారుడికి పోలికలే లేవని చెప్పాడు. అయితే ఈ వాదనలను ఫోరెన్సిక్ నిపుణులు కొట్టిపారేస్తున్నారు.
పుణె: సైఫ్ అలీఖాన్ దవాఖాన నుంచి బయటకు నడచి వచ్చిన తీరుని గమనించి తాను ఆశ్చర్యపోయానని.. ‘ఆయన నిజంగానే దాడికి గురయ్యరా లేక నటిస్తున్నారా’ అని అనిపించిందని మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణె గురువారం వ్యాఖ్యానించారు.