ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోటుకు గురైన విషయం తెలిసిందే. బాంద్రాలోని అతణఙ ఇంట్లో ఓ బంగ్లాదేశీ వ్యక్తి పొడిచాడు. లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన సైఫ్.. ఆరు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ఆస్పత్రి నుంచి సైఫ్ బయటకు వెస్తున్న సమయంలో.. అతను కనిపించిన తీరుపై మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే(Nitesh Rane) అనుమానాలు వ్యక్తం చేశారు. సైఫ్‌కు ఆరు చోట్ల కత్తి పోట్లు దిగాయి. వెన్నుపూసలో ఏకంగా కత్తిముక్కే విరిగింది. దాన్ని ఆస్పత్రి డాక్టర్లు చికిత్స చేసి తీశారు.
#WATCH | Pune: Maharashtra Minister Nitesh Rane says, “Look at what Bangladeshis are doing in Mumbai. They entered Saif Ali Khan’s house. Earlier they used to stand at the crossings of the roads, now they have started entering houses. Maybe he came to take him (Saif) away. It is… pic.twitter.com/XUBwpwQ6RQ
— ANI (@ANI) January 23, 2025
సైఫ్‌పై విమర్శలు చేసిన మంత్రి రాణే.. ఆస్పత్రి నుంచి నాట్యం చేస్తూ నడుచుకుంటూ వచ్చినట్లు ఆరోపించాడు. ఇంతకీ అతన్ని పొడిచారా లేదా అన్న అనుమానం వస్తోందన్నారు. సైఫ్ నటిస్తున్నాడేమో అని కూడా మంత్రి పేర్కొన్నారు. బంగ్లాదేశీలు ముంబైలో ఏం చేశారో చూశారా, వాళ్లు సైఫ్ ఇంట్లోకి వెళ్లారని, ఒకప్పుడు వాళ్లు రోడ్డుమీద క్రాసింగ్స్ వద్ద నిలబడేవారని, ఇప్పుడు వాళ్లు ఇండ్లల్లోకి ఎంటర్ అవుతున్నారని విమర్శించారు. బహుశా సైఫ్ అలీఖాన్‌ను తీసుకువెళ్లేందుకు వచ్చి ఉంటారని రాణే పేర్కొన్నారు. చెత్తను ఏరివేయడం మంచిదే అన్నారు. ఆస్పత్రి నుంచి అతను వచ్చిన స్టయిల్ చూస్తే, అతన్ని పొడిచారా లేదా అన్న డౌట్ వస్తోందన్నారు.
ఎన్సీపీ నేతలు జితేంద్ర అవద్, సుప్రీయా సూలే వైఖరిని కూడా మంత్రి నితీశ్ రాణే ఖండించారు. కేవలం ఖాన్లకు ఏదైనా జరిగితేనే, వాళ్లు స్పందిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ల గురించి మాట్లాడుతారని, సుశాంత్ రాత్పుత్ లాంటి హిందూ నటులను వేధిస్తే ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడరన్నారు. అవద్, సూలే లాంటి వాళ్లు దానిపై మాట్లాడలేదన్నారు. ఓ హిందువు ఆర్టిస్టు గురించి ఎన్సీపీ నేతలు ఆందోళన చెందడం ఎప్పుడైనా చూశారా అని అడిగారు.
He was stabbed in spine?
And he is walking fine in less than a week?
Something looks fishy in the whole Saif Ali Khan stabbing thing.
Was it just a PR Stunt? pic.twitter.com/38ZJg0MiDi
— The Jaipur Dialogues (@JaipurDialogues) January 22, 2025