Manchu Manoj | మూడేళ్ల వైవాహిక జీవితం ..మరింత బలమైన బంధంగా మనోజ్–మౌనిక ప్రయాణం
Manchu Manoj | మూడు సంవత్సరాల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న మంచు మనోజ్-భూమా మౌనిక జంట జీవితం ప్రతి అడుగులో కొత్త ఆనందాలతో ముందుకు సాగుతోంది. కుమారుడు ధైరవ్తో పాటు 2024 ఏప్రిల్ 2న జన్మించిన దేవసేన శోభ తమ కుటుంబంలోకి రావడంతో వారి జీవితం మరింత సంతోషంగా మారింది.
Manchu Manoj | మూడు సంవత్సరాల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న మంచు మనోజ్-భూమా మౌనిక జంట జీవితం ప్రతి అడుగులో కొత్త ఆనందాలతో ముందుకు సాగుతోంది. కుమారుడు ధైరవ్తో పాటు 2024 ఏప్రిల్ 2న జన్మించిన దేవసేన శోభ తమ కుటుంబంలోకి రావడంతో వారి జీవితం మరింత సంతోషంగా మారింది. కుటుంబంగా, దంపతులుగా పరస్పర అండదండలతో ఆదర్శవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.వృత్తిపరంగా కూడా మనోజ్‌కు వివాహానంతరం మంచి కలిసివచ్చింది. ‘భైరవం’, ‘మిరాయ్’ వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధిస్తూ తన మాస్ అప్పీల్‌ను మరొకసారి చాటుకున్నారు. ఈ సినిమాల్లో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, అభిమానుల ప్రేమ మరింత బలపడింది.
ప్రస్తుతం మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్టులను కూడా ఆయన త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, గత ఏడాది నవంబర్‌లో మనోజ్ ప్రారంభించిన ‘మోహన రాగ మ్యూజిక్’ లేబుల్ కూడా మంచి స్పందన పొందుతోంది. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు సంగీతాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ సంస్థ ముందుకు సాగుతోంది.ఇక మౌనిక కూడా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ‘నమస్తే వరల్డ్ సెలబ్రేటింగ్ కిడ్స్’ పేరుతో స్వదేశీ బొమ్మల బ్రాండ్‌ను స్థాపించి ఫౌండర్, సీఈవోగా విజయవంతంగా నడిపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 300కు పైగా రిటైల్ స్టోర్లలో 75 వేల యూనిట్లకు పైగా విక్రయాలు సాధించిన ఈ బ్రాండ్, హామ్లీస్, మదర్‌కేర్, అమెజాన్, ఫస్ట్‌క్రై వంటి ప్రముఖ వేదికల్లో అందుబాటులో ఉంది. పూర్తిగా స్వయం నిధులతో, జీరో పెయిడ్ ప్రమోషన్‌తో ఎదిగిన ఈ సంస్థకు రిలయన్స్‌తో పంపిణీ భాగస్వామ్యం కూడా లభించింది. త్వరలోనే డైరెక్ట్ టు కన్జ్యూమర్ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ జంటకు ఉన్న క్రేజ్ ప్రత్యేకం అని చెప్పాలి. అభిమానులు వారి వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా, భవిష్యత్ రాజకీయ ప్రవేశంపై కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు వారు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

