Sara Ali khan | దుండగుడి దాడిలో గాయపడ్డ బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరగా.. ఆరు రోజుల చికిత్స అనంతరం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ నివాసానికి కుటుంబ సభ్యులు ఒక్కక్కరిగా చేరుకుని పరామర్శిస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ నటి సారా అలీఖాన్ (Sara Ali khan) ముంబైలోని నివాసానికి చేరుకుని తన తండ్రి సైఫ్ అలీఖాన్‌ను పరామర్శించింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (Mohammad Shariful Islam Shahzad) అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
షెహజాద్ పోలీసులు ఇప్పటికే శనివారం అర్థరాత్రి 2.50గంటలకు థానేలోని హిరానంది ప్రాంతంలో అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు.
సైఫ్ అలీ ఖాన్‌కు భద్రతకు బాలీవుడ్ యాక్టర్ సెక్యూరిటీ ఏజెన్సీ..
డాక్టర్లు వారం పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సైఫ్ అలీఖాన్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ భద్రత కోసం పాపులర్ బాలీవుడ్ యాక్టర్ రోనిత్ రాయ్ సెక్యూరిటీ ఏజెన్సీ AceSqad Security LLPని కూడా నియమించుకుంది. రోనిత్ రాయ్ సైఫ్ అలీఖాన్ అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని పర్సనల్‌గా భద్రతా చర్యలను పర్యవేక్షిస్తుంది. రోనిత్ రాయ్ ఏజెన్సీ ఇప్పటికే బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్‌ఖాన్ భద్రతను చూసుకుంటుంది.
Sara Ali Khan 🧡😎#SaraAliKhan pic.twitter.com/Iq0bdapfTZ
— WV – Media (@wvmediaa) January 23, 2025
Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?