Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. ఓపెనింగ్ డే నుంచి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలుస్తున్నాడు పుష్పరాజ్.
అంతా అనుకున్నట్టుగానే పుష్పరాజ్ గ్లోబల్ బాక్సాఫీస్‌ను రఫ్పాడించేశాడు. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రికార్డులు సాధించిన భారతీయ సినిమాలుగా ఇప్పటివరకు బాహుబలి 2 ( రూ.1810 కోట్లు ), దంగల్ (సుమారు రూ.2200 కోట్లు) రికార్డులు నమోదు చేశాయి. ముందు నుంచి వస్తున్న ట్రేడ్ పండితులు, మూవీ లవర్స్ అంచనాలే నిజమయ్యాయి.
పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) గ్లోబల్ బాక్సాఫీస్ ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టేశాడు. పుష్ప 2 తాజా కథనాల ప్రకారం వరల్డ్‌వైడ్‌గా రూ.2200 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ఆల్ టైమ్ హయ్యెస్ గ్రాస్ సాధించిన భారతీయ సినిమాగా చెరగని ఫీట్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అభిమానులతోపాటు సుకుమార్ ఫాలోవర్లు గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
ఈ మూవీలో కన్నడ సోయం రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహద్ ఫాసిల్, రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. షణ్ముఖ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సీక్వెల్‌కు దేవీ శ్రీ ప్రసాద్, సామ్ సిఎస్ అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
Income Tax Of India Declared #Pushpa2TheRule is India’s Highest Grossing Film..#AlluArjun #Pushpa2 pic.twitter.com/USRmbZCD3p
— South Digital Media (@SDM_official1) January 22, 2025
Sukumar | పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
Dil Raju | విజయ్ వారిసు కలెక్షన్లు రూ.120 కోట్లే.. ఐటీ అధికారులతో దిల్ రాజు.. ?