Gautham Vasudev Menon | తెలుగు, తమిళం, మలయాళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని సెలబ్రిటీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon). యాక్టర్‌గా, స్క్రీన్ రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న మలయాళ చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (Dominic and the Ladies’ Purse). మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
ఈ మూవీ జనవరి 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు గౌతమ్ మీనన్. నిజం చెప్పాలంటే సినిమాలకు భారీ బడ్జెట్ అవసరం లేదు. మంచి కంటెంట్ అనేది పరిగణలోకి వస్తుంది. రూ.100 కోట్ల సినిమాలు తెరకెక్కించేందుకు బదులు రూ.10 కోట్ల బడ్జెట్‌తో పది సినిమాలు నిర్మించడంపై ఫోకస్ పెట్టాలన్నాడు.
చాలా మంది తమిళ యాక్టర్లు స్క్రిప్ట్‌తో సంబంధం లేకుండా హై బడ్జెట్ సినిమాలపై పనిచేసేందుకు ఇష్టపడుతుంటారన్నాడు గౌతమ్ మీనన్. నాకొక అవకాశం ఇస్తే.. కథలతో మొదలు.. ప్రతీ విషయాన్ని మాలీవుడ్‌కు తీసుకొస్తా. ఆ కథల్లో సగానికిపైగా సినిమాలు తమిళంలో తెరకెక్కించబడవు. ఒక సినిమా మలయాళంలో సక్సెస్ అయితే దాన్ని కోలీవుడ్‌లో రీమేక్ చేస్తారు. కానీ తమిళ యాక్టర్లు మాత్రం అలాంటి ఒరిజినల్ స్క్రిప్ట్‌ను చేసేందుకు ఎప్పుడూ ఒకే చెప్పరు.
ఈ ప్రకటన తర్వాత నేను తమిళ సినిమాల్లో పనిచేయలేకపోవచ్చంటూ కోలీవుడ్‌లో ఉన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు గౌతమ్ మీనన్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో గౌతమ్ మీనన్ తమిళ సినిమాల నుంచి దూరంగా ఉండబోతున్నాడా..? అంటూ అప్పుడే చర్చించుకుంటున్నారు నెటిజన్లు, మూవీ లవర్స్.
Jailer Villain | మద్యం మత్తులో జైలర్ విలన్ వినాయకన్ వీరంగం.. ఇంతకీ ఏం చేశాడంటే..?
Jaat Movie | సన్నీడియోల్-గోపీచంద్ మూవీ కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు.. !
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్