Jailer Villain | రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్‌గా నటించిన ఇండియావైడ్‌గా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నాడు మలయాళ నటుడు వినాయకన్ (Vinayakan). ఈ క్రేజీ యాక్టర్ దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. మద్యం మత్తులో పొరుగింటి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఊగిపోతున్న వినాయకన్ తన ఇంటి బాల్కనీపై లుంగీ కట్టుకుంటూ.. అరుస్తూ పొరుగింటి వారిని అసభ్యంగా దూషించాడు.
ఈ వీడియో నెట్టింట వైరల్ అవగా.. వినాయకన్ ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల రియాక్షన్ నేపథ్యంలో వినాయకన్ ఫేస్బుక్లో క్షమాపణ కోరుతూ సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఒక సినిమా నటుడిగా.. ఒక వ్యక్తిగా కూడా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు సమస్యలను ఎదుర్కోలేను. నా నుంచి వచ్చిన ప్రతికూల చర్యలన్నింటికి బాధ్యత వహిస్తూ.. సాధారణ ప్రజలను నేను క్షమాపణలు కోరుతున్నా. చర్చలు కొనసాగనివ్వండి.. అవ్వండి అంటూ విజ్ఞప్తి చేశాడు వినాయకన్.
ఇప్పుడీ పోస్ట్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. వినాయకన్ గతంలో కూడా గోవాలో ఓ వ్యాపారితో గొడవ పెట్టుకున్నాడు.
Actor #Vinayakan shouting & abusing his Neighbor 🤢pic.twitter.com/w745mVfY2O
— Milagro Movies (@MilagroMovies) January 21, 2025
Jaat Movie | సన్నీడియోల్-గోపీచంద్ మూవీ కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు.. !
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్
Gautham Vasudev Menon | ధృవ నక్షత్రం కథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయా: గౌతమ్ మీనన్