Gautham Vasudev Menon | కోలీవుడ్‌లో యాక్టర్, దర్శకుడిగా విజయవంతంగా ప్రయాణాన్ని సాగిస్తున్న సెలబ్రిటీల జాబితాలో టాప్‌లో ఉంటాడు గౌతమ్ మీనన్ (Gautham Vasudev Menon). ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలతోపాటు సూపర్ క్రేజ్ ఉంటుంది. గౌతమ్ మీనన్ చాలా కాలం క్రితం విక్రమ్ హీరోగా ధృవ నక్షత్రం (Dhruva Natchathiram) సినిమాను ప్రకటించాడని తెలిసిందే.
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఓ చిట్‌చాట్‌లో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు గౌతమ్ మీనన్. ఈ మూవీ కథను మొదట వేరే హీరోలకు చెప్తే.. పలు కారణాల వల్ల వాళ్లు సినిమాను తిరస్కరించారన్నాడు గౌతమ్ మీనన్. ఆ హీరోల అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం వల్ల సినిమాను రిజెక్ట్ చేసినందుకు నేనేమీ బాధపడలేదన్నాడు. కానీ ఈ కథకు సూర్య నో చెప్పడాన్ని మాత్రం తట్టుకోలేకపోయాయని.. అది నన్నెంతో బాధించింది.
నేను ధృవ నక్షత్రం రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నా. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. చాలా ఏండ్ల క్రితం తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకులు బోర్‌గా ఫీల్ కారు. నేటితరం ప్రేక్షకులకు ఈ మూవీ తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇంకేంటి మరి చాలా కాలంగా విడుదలకు నోచుకోని ఈ మూవీ త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుందన్న మాట.
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో
Shatrughan Sinha | ఏఐతో సైఫ్ అలీఖాన్‌పై పోస్ట్.. విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా