Bhairavam Teaser | బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం భైరవం (Bhairavam). ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో అదితీశంకర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. భైరవం నుంచి ఇప్పటికే విడుదల చేసిన బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం టీజర్ విడుదల చేశారు మేకర్స్.
భైరవం టీజర్‌ను విడుదల చేశారు. రాత్రి నాకొక కల వచ్చింది. చుట్టు తెగిపడిన తలలు, మొండాలు.. అంటూ సాగే సంభాషణలతో మొదలైంది టీజర్. దూరంగా మృత్యువు తెలియని జయించిన కృష్ణుడిలా శంఖం పూరించుకుని వెళ్లిపోతున్న శ్రీను.. ఈ ఊరిని కాపాడటానికి వారాహి అమ్మవారు.. ఆ అమ్మగుడిని కాపాడటానికి నానమ్మ ఉండగా నాకేమవుతుందమ్మా అంటున్నాడు నారా రోహిత్. అమ్మవారి గుడిని కాపాడే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు టీజర్‌తో హింట్ ఇస్తున్నాడు డైరెక్టర్. ఇక శ్రీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా.. వాడి జోలికెవడైనా వస్తే కొడకా ప్రాణాలు తీస్తానంటున్నా మనోజ్.
ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న భైరవంలో మనోజ్ గజపతిగా కనిపించనుండగా.. నారా రోహిత్ వరద పాత్రలో కనిపించబోతున్నాడు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ పాత్రలు మాస్ అప్పీల్‌తో ఉండబోతున్నట్టు టీజర్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
భైరవం టీజర్..
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో
Shatrughan Sinha | ఏఐతో సైఫ్ అలీఖాన్‌పై పోస్ట్.. విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?