Thalapathy 70 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం దళపతి 69)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విజయ్ పొలిటికల్ జర్నీ నేపథ్యంలో హెచ్ వినోథ్ డైరెక్ట్ చేస్తు్న్న ఈ ప్రాజెక్ట్ చివరి సినిమా అని ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. విజయ్ నుంచి ఇక సినిమాలుండవని తెలిసిన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. వారి కోసం విజయ్ మనసు మార్చుకున్నాడా..? మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడా..? అంటే తాజా కథనాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
తాజాగా దళపతి 70 (Thalapathy 70సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. వెంకట్ ప్రభు విజయ్ కోసం ఓ స్కిప్ట్ సిద్దం చేశాడని.. అన్నీ అనుకున్నట్టుగానే కుదిరితే ఈ సినిమాను వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తాడని ట్రేడ్ ఎనలిస్టులె చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ నటించిన లియో సినిమాకు సీక్వెల్ రాబోతుందని అప్పట్లో వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడిదే ప్రాజెక్ట్ మళ్లీ లైన్లోకి వచ్చేసింది.
సెవెన్ స్క్రీన్ స్టూడియో విజయ్‌తో లియో2 ప్రకటించేందుకు ప్లాన్ చేస్తుందట. మరి దళపతి 70 ప్రాజెక్ట్‌గా ఏ సినిమా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించినా.. ఆ తర్వాత చిరంజీవి సూచనల ప్రకారం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు విజయవంతంగా డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిసిందే. ఇక విజయ్ కూడా ఇదే లైన్లో వెళ్తూ సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాడని ఇండస్ట్రీ అంతటా జోరుగా టాక్ నడుస్తోంది.
దళపతి 69 చిత్రంలో పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. దళపతి 69లో ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీడియోల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
#ThalapathyVijay‘s Next Film Talks Going ON✅️
– ThalapathyVijay have a Plan to Make his 70th Film #Thalapathy70
– He also said #VenkatPrabhu to write a Script, So If T70 Happen then it is Directed by #VPpic.twitter.com/BRNW2VejrJ— Movie Tamil (@MovieTamil4) January 18, 2025
Court Movie | నాని ప్రోడక్షన్లో ప్రియదర్శి ‘కోర్టు’.. విడుదల తేదీ ఖరారు.!