Saraswathi | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ భామ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం‘సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రాబోతన్న ఈ మూవీని దోశ డైరీస్ పతాకంపై పూజా శరత్‌కుమార్ నిర్మించారు. మార్చి 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్ టీం.
ప్రమోషన్స్‌లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ టీం టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణను కలిసింది. మూవీ రషెస్ చూసిన బాలకృష్ణ చాలా బాగుందని ప్రశంసించాడు. మీ అండ్ లేడీ బాలకృష్ణ.. ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్.. తప్పకుండా సినిమా చూడండి అందరూ.. అంటూ బాలకృష్ణ తనదైన స్టైల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ మొదటి సినిమానే అయినప్పటికీ పక్కా ప్లాన్‌తో ఈ సినిమాను కేవలం 30 రోజుల్లోనే షూట్ చేయడం విశేషం.
Team #Saraswathi Met Roaring Lion #NandamuriBalakrishna , Took His Blessings . #SaraswathiMovie On March 06th In Theatres ! @varusarath5 #NBK pic.twitter.com/56A2zr4Glo
— BA Raju’s Team (@baraju_SuperHit) March 2, 2026
Toxic | యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ రిలీజ్.. ఆడియోతోనే అంచనాలు రెట్టింపు!