Priyanka Chopra | పాపులర్ అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) హాలీవుడ్‌కు పరిమితమైపోయిందని తెలిసిందే. ఈ భామ రీఎంట్రీకి రెడీ అయినట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ బ్యూటీ ఫైనల్‌గా ఎస్ఎస్ఎంబీ 29తో మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు రెడీ అవుతుందని బీటౌన్ సర్కిల్ టాక్. ఈ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా గురువారం సాయంత్రం టొరంటో నుంచి హైదరాబాద్‌లో ల్యాండైంది. దీనిక్కారణం మహేశ్ బాబు చేయబోతున్న కొత్త సినిమానేనట.
ప్రియాంకా చోప్రా ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) అనౌన్స్మెంట్ ఈవెంట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిందని నెట్టింట కథనాలు రౌండప్ చేస్తున్నాయి. ప్రియాంకా చోప్రా తప్పకుండా ఎస్ఎస్ఎంబీ 29లో భాగం కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని నెట్టింట ఓ అభిమాని కామెంట్ చేయగా… ఆమె ఫైనల్ అయిందని భావిస్తున్నా. అయితే మాత్రం అద్భుతమైనదని చెప్పాలి.. అని మరో అభిమాని కామెంట్ చేశారు.
ఇదే నిజమైతే ఐదేళ్ల తర్వాత ప్రియాంకా చోప్రా చేయబోతున్న భారతీయ సినిమా ఎస్ఎస్ఎంబీ 29 కానుంది. మరి దీనిపై కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2002లో తొలిసారి తమిళ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ బీహారీ సుందరి ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. తుఫాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా హాయ్ చెప్పింది.
ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ఇప్పటికే మేకోవర్ మార్చుకుని.. లాంగ్ హెయిర్, గడ్డం, పోనీ టెయిల్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు.
Finally it’s happening indian actress n hollywood superstar #PriyankaChopra arrives in Hyd #ssmb29 #MaheshBabu #SSrajamouli pic.twitter.com/9JRpPgCkpa
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) January 16, 2025
Dhanush | బ్లాక్ బస్టర్ కాంబో రెడీ.. వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా ఇదే అయి ఉంటుందా..?
Sankranthiki Vasthunam | మూడు రోజుల్లోనే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం బ్రేక్ ఈవెన్ పూర్తి