Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా.. హరిహరవీరమల్లు పార్ట్ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫస్టి సింగిల్ వినాలి.. వీరమల్లు మాట వినాలి ప్రోమో కూడా విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ చేశారు.
ఏం గుల్పామ్ ఏం గురాయించి చూస్తున్నవ్ భయపెట్టనీకా..? ఓహో చాలా మందిని చూసినాంలే బిడ్డా. హే మునిమాణిక్యం చూసినవా.. గురాయించి చూస్తుండు బేటా.. మన లెక్క తెల్వదు.. వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి.. అంటూ తెలంగాణ యాసలో పవన్ కల్యాణ్ స్టైల్లో సాగుతున్న లిరిక్స్ ఆకట్టుకుంటూ.. అభిమానులను థ్రిల్ చేస్తున్నాయి. పెంచల్ దాస్ రాసిన ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజిషన్‌లో పవన్ కల్యాణ్ పాడాడు. ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పికుడిగా వ్యవహరిస్తున్నారు.
క్లైమాక్స్‌లో వచ్చే రెడ్ డ్రెస్ ఫైట్‌ను 42 రోజులపాటు చిత్రీకరించారని ఇన్సైడ్ టాక్. ఇక ఈ చిత్రంలో ఇంట్రో సాంగ్, టైగర్ ఫైట్, మహల్ యాక్షన్ పార్ట్, కుస్తీ ఫైట్ సీన్, చార్మినార్ యాక్షన్ సన్నివేశాలు, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ భారీ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ వార్ సీన్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించబోతున్నాయట.
మాట వినాలి లిరికల్ వీడియో..
Sankranthiki Vasthunnam Review | వెంకటేశ్ బ్లాక్ బస్టర్ కొట్టాడా..? సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ
Dhanush | బ్లాక్ బస్టర్ కాంబో రెడీ.. వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా ఇదే అయి ఉంటుందా..?
Raja Saab | ప్రభాస్ రాజాసాబ్‌కు మాస్ ఆల్బమ్.. పాటలు ఎలా ఉంటాయో చెప్పిన థమన్