Raja Saab | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రాల్లో ఒకటి రాజాసాబ్ (raja saab). మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ హార్రర్ కామెడీ జోనర్లో వస్తోంది. రాజాసాబ్‌లో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
వారి కోసం ఆసక్తికర వార్తను షేర్ చేశాడు మ్యూజిక్ ఎస్ థమన్. ఈ సినిమాకు మాస్ ఆల్బమ్ రెడీ చేశామన్నాడు ఎస్ థమన్. అంతేకాదు పాటలెలా ఉండబోతున్నాయో కూడా హింట్ ఇచ్చేశాడు. ఆల్బమ్‌లో 6-7 పాటలుంటాయి. నాలుగు పూర్తి చేశాం. మిగిలినవి కంప్లీట్ చేయాల్సి ఉంది. సినిమాలో 30-40 ఓఎస్టీ ట్రాక్స్ ఉండబోతున్నాయి. ఇవి టాలీవుడ్లో బెస్ట్ ఓఎస్టీగా నిలువబోతుందంటూ చెప్పుకొచ్చాడు. ఆల్బమ్‌లో ఇంట్రడక్షన్ సాంగ్, మాస్ నంబర్, ఐటెం సాంగ్, ముగ్గురమ్మాయిలతో సాంగ్ (3 పాటలు )తోపాటు థీమ్ సాంగ్ కూడా ఉండబోతుందని, రాజాసాబ్ కోసం డిఫరెంట్ వరల్డ్‌ను సృష్టిస్తున్నామని చెప్పి అభిమానులు, మూవీ లవర్స్‌లో సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాడు థమన్.
ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ అద్భుతమంటూ ఆకాశానికెత్తేశాడు థమన్. రాజాసాబ్ గ్లింప్స్ చూస్తే.. ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. రాజాసాబ్ మోషన్ పోస్టర్ ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నయనతార స్పెషల్ సాంగ్‌లో మెరువనుందని ఇన్సైడ్ టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
#TheRajaSaab has Massive mass songs , You will see Vintage #Prabhas in Raja Saab – @MusicThaman
😍🥺💥💥💥 pic.twitter.com/jyoTHQXdZ7
— Prabhas Trends (@TrendsPrabhas) January 13, 2025
Dhanush | బ్లాక్ బస్టర్ కాంబో రెడీ.. వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా ఇదే అయి ఉంటుందా..?
Daaku Maharaaj | వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ అరుదైన ఫీట్.. ఇంతకీ ఏంటో తెలుసా..?