Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj). బాబీ (Bobby) దర్శకత్వంలో ఎన్బీకే 109 (NBK109)గా వచ్చిన ఈ మూవీ జనవరి 12న (ఆదివారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఓపెనింగ్ డేన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్‌గా ఓపెనింగ్ డేన డాకు మహారాజ్ రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టి.. బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిందని ఇప్పటికే మేకర్స్ స్టన్నింగ్ వార్తను షేర్ చేశారు.
తాజాగా మరో క్రేజీ వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇప్పటికే డాకు మహారాజ్ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద రూ.6.50 కోట్లు ($1 Million mark) మార్క్ చేరుకుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత మిలియన్ డాలర్ మార్క్ చేరుకున్న నాలుగో సినిమాగా నిలిచింది. యూఎస్ఏలో వరుసగా నాలుగు సినిమాలు మిలియన్ డాలర్ మార్క్ సాధించిన వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
డాకు మహారాజ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో బాలకృష్ణ బాక్సాఫీస్ మేనియా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, ప్రగ్యాజైశ్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించగా.. రోనిత్ రాయ్, శ్రద్దా శ్రీనాథ్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కించారు.
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు