Arugu Meedha Video Promo | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారని తెలిసిందే. ఇందులో రాంచరణ్, అంజలి పోర్షన్‌కు సంబంధించిన అప్పన్న, పార్వతి పాత్రలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది.
తాజాగా ఈ క్రేజీ కాంబోలో వచ్చే అరుగు మీద వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. అలికి పూసిన అరుగు మీద కల్కి సుందరినై కూసుంటే.. పలుకరించవేంది ఓ దొరా అంటూ అప్పన్న కోసం పార్వతి పాడుతున్న పాట ప్రోమో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. అప్పన్న, పార్వతి ఎమోషనల్ జర్నీ మూవీ లవర్స్‌ను భావోద్వేగానికి లోను చేస్తుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను ఎస్ థమన్, రోషిని జేకేవీ పాడారు. ఈ వీడియో సాంగ్ ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి మరి.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు.
అరుగు మీద వీడియో సాంగ్ ప్రోమో..
Balakrishna | ఊర్వశి రౌతేలాతో బాలకృష్ణ స్టెప్పులు.. ముద్దులతో ముంచెత్తిన డాకు మహారాజ్.. Video
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు