Balakrishna | హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. ఆ మూవీ యూనిట్ ఆదివారం రాత్రి సక్సెస్ పార్టీ నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన ఈ పార్టీకి బాలకృష్ణతో పాటు ఆ సినిమా దర్శకుడు, నిర్మాత, హీరోయిన్లు, పలువురు హీరోలు హాజరై సందడి చేశారు.
డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో పాటు యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ హంగామా చేశారు. సిద్ధూ, విశ్వక్సేన్ చెంపలపై బాలయ్య ముద్దులు పెట్టి.. అందర్నీ హుషారుపరిచారు. ఈ ఇద్దరు హీరోలు కూడా బాలకృష్ణపై తమకున్న అభిమానాన్ని చూపించారు. ఈ ముద్దుల వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నా సక్సెసే మీ సక్సెస్ అని, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్ అని డాకు మహారాజ్ పేర్కొన్నారు.
ఇక ఊర్వశి రౌతేలాతో బాలయ్య మళ్లీ స్టెప్పులేశారు. దబిడి దిబిడి పాటకు డ్యాన్స్ చేస్తూ ఊర్వశితో ఊగిపోయారు బాలయ్య. బాలయ్య స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు రాగానే.. ఊర్వశి అటు నుంచి పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోని ఊర్వశి తన ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
దబిడి దిబిడి పాట స్టెప్పులపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అయిన బాలకృష్ణతో అసభ్యకరమైన స్టెప్పులు వేయించారంటూ శేఖర్ మాస్టర్‌ను నెటిజన్స్ ఏకిపారేశారు. కూతురు వయసున్న ఊర్వశి రౌతేలాతో బాలయ్య అలాంటి స్టెప్పులేయడం అసభ్యకరంగా ఉందని కామెంట్ చేశారు. సక్సెస్ పార్టీలో మరోసారి ఊర్వశితో బాలయ్య అదే స్టెప్పులేయడం కాస్త వైరల్ అయింది.
ఇక బాలకృష్ణ హీరోగా నటించిన `డాకు మహారాజ్` సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా, బాబీ డియోల్ నెగటివ్ రోల్లో నటించారు. నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. సంక్రాంతి కానుకగా చాలా గ్రాండ్‌గా నేడు ఆదివారం సినిమా విడుదలైంది. ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్ వస్తుంది.
Congratulations #NBK sir 🔥💥💥#DaakuMaharaj pic.twitter.com/YQigBqVQNW
— VishwakSen (@VishwakSenActor) January 12, 2025