AjithKumar | కోలీవుడ్‌లో మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు అజిత్‌కుమార్ (Ajith kumar). ఈ స్టార్ యాక్టర్ సినిమాలతో కోట్లాది మంది అభిమానులకు వినోదాన్ని అందించడమే కాదు… తన రేసింగ్ స్కిల్స్‌తో యావత్ భారతదేశ గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. దుబాయ్ 24H సిరీస్‌లో భాగంగా అజిత్ కుమార్ టీం శనివారం జరిగిన ఎండ్యూరెన్స్ రేసు (Dubai 24H event)లో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ రేసింగ్‌లో అజిత్ కుమార్ టీం పోర్చే 992 కేటగిరీలో 3వ స్థానంలో నిలువగా.. దుబాయ్ 24H సిరీస్‌లో 23వ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా అజిత్ కుమార్ రెపరెపలాడుతున్న మువ్వన్నెల జాతీయ జెండాను పట్టుకొని గ్యాలరీవైపుకు ఆనందంతో పరుగెత్తుకొచ్చాడు. అందరికీ భారత జెండాను చూపిస్తూ దేశమంతా గర్వించేలా చేశాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కార్ రేసింగ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన అజిత్ కుమార్ టీంకు అభిమానులు, ఫాలోవర్లు, రేసింగ్ లవర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొన్ని రోజులుగా దుబాయ్ కార్ రేసింగ్ కోసం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుడగా అజిత్ కారు ట్రాక్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో భారీ ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ అజిత్ కుమార్ తన టీంతో కలిసి ఏ మాత్రం తగ్గేదేలా అంటూ సత్తా చూపించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు.
అజిత్‌కుమార్ ప్రస్తుతం మగిజ్ తిరుమేని డైరెక్షన్లో విదాముయార్చి సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కూడా చేస్తున్నాడు.
అజిత్ కుమార్ టీం సెలబ్రేషన్స్ ఇలా..
Happy to see AK like this! ✨
My man is living his life ❤️📈#AjithKumar #Ajith #Ajithkumar𓃵 #AjithKumarRacing pic.twitter.com/7DHJo1uoTE— Video Memes (@VideoMemes_VM) January 12, 2025
This video is so heartwarming and so full of 😍❤️ The way #Shalini looks at her husband #AK is priceless 🙌👌
Ajithjumar Showed everyone Age is just number #AjithKumarRacing#Ajithkumar𓃵 pic.twitter.com/KkWnTwF3H3— kumar (@KumarlLamani) January 13, 2025
#AjithKumarRacing Team has won third place in #Dubai24HSeries 🔥🔥🔥 pic.twitter.com/gBduAtocrj
— Spaces (@TamilSpaces) January 12, 2025
Congratulations #AjithkumarRacing team #ajithsaar #AK #Thala #24HRracingDubai pic.twitter.com/G3I5fCMRhj
— venkat prabhu (@vp_offl) January 12, 2025