Triptii Dimri | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆల్ టైమ్ ఎవర్గ్రీన్ ఫేవరేట్ సినిమాలు కొన్నుంటాయి. ఆ జాబితాలో టాప్‌లో ఉంటుంది ఆషిఖి (Aashiqui). ఈ ప్రాంచైజీలో ఇప్పటికే ఆషిఖి 2 కూడా వచ్చిందని తెలిసిందే. అయితే ఇప్పుడిక ఆషిఖి3 (Aashiqui 3) టైం కూడా వచ్చేసింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ సినిమా రాబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
కాగా ఈ సినిమాలో యానిమల్ హీరోయిన్ తృప్తి డిమ్రిని ఫీ మేల్ లీడ్ రోల్లో తీసుకోబోతున్నారని వార్తలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకు తృప్తి డిమ్రి సెటవదని భావిస్తున్న మేకర్స్ మరో భామను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని బీటౌన్ సర్కిల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తాజా కథనాల ప్రకారం తృప్తి డిమ్రి ఈ ప్రాజెక్టు పట్ల ఎక్జయిటింగ్‌గా ఉన్నప్పటికీ.. మేకర్స్ మాత్రం ఈ భామ స్థానంలో కొత్తమ్మాయిని తీసుకోవాలని అనుకుంటున్నారని ఇన్సైడ్ టాక్. మరి మేకర్స్ రాబోయే రోజుల్లో దీనిపై ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. భూల్ భూలయ్యా 3 సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు కార్తీక్ ఆర్యన్. మరి ఈ క్రేజీ సినిమాపై రానున్న రోజుల్లో ఏదైనా స్పష్టత వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
యానిమల్ బ్యూటీ బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌తో సినిమా చేసేందుకు సైన్ చేసిందని బీటౌన్ సర్కిల్ సమాచారం. ఈ చిత్రాన్ని జల్సా అండ్ తుమ్హారీ సులు ఫేం విక్రమ్ మల్హోత్రా డైరెక్ట్ చేయబోతుండగా.. మరిన్ని వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
#TriptiiDimri exits #Aashiqui3.
Reports suggest that the makers wanted to cast someone who embodies innocence and purity and the actress did not fit the part.
As per our source, “Triptii Dimri was very excited about this film, however, now this is not going to happen. A new… pic.twitter.com/buMbcRhVdb
— Filmfare (@filmfare) January 9, 2025
Game Changer | గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లపై హైకోర్టులో విచారణ
Shraddha Kapoor | శ్రద్ధాకపూర్ న్యూ హెయిర్ కట్.. కొత్త లుక్ స్పెషలేంటో..?
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి