Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఎన్బీకే 109 (NBK109)గా బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
కాగా ఈ సినిమా చివరి రోజు షూటింగ్లో భావోద్వేగపూరిత సన్నివేశం చోటుచేసుకుంది. డాకు మహారాజ్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన వేద అగర్వాల్ తన నానాజీ (బాలకృష్ణ)కు వీడ్కోలు పలికే సమయం రావడంతో ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంటున్న వేదను దగ్గరకు తీసుకొని ఓదార్చాడు బాలకృష్ణ. సెట్స్‌లో నటీనటుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో కండ్లకు కట్టినట్టు చూపించే ఈ సీన్‌ను చూసి అక్కడున్నవాళ్లంతా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
When work turns into Family❤️#DaakuMaharaaj Child artist gets emotional on the last day of shoot.#VedaAgarwal Insta post❤️
Two kids in one frame #Balayya ❤️
A bond beyond the screen❤️#NandamuriBalakrishna #DaakuMaharaajOnJan12th pic.twitter.com/lSSvWCY6j5— manabalayya.com (@manabalayya) January 9, 2025
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య