Swayambhu | తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్న యాక్టర్లలో ఒకడు టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ (Nikhil). ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా స్వయంభు (SWAYAMBHU). నిఖిల్ 20(Nikhil 20)గా వస్తోన్న ఈ మూవీలో మలయాళ బ్యూటీ సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవిబస్రూర్ మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. నిఖిల్ టీం తాజాగా రవి బస్రూర్ స్టూడియోకు వెళ్లింది.
నిఖిల్‌తోపాటు పాపులర్ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కర్ణాటక బస్రూర్లోని స్టూడియోకు వెళ్లిన వారిలో ఉన్నారు. రవిబస్రూర్ టీం మ్యూజిక్ సిట్టింగ్స్ పనుల్లో నిమగ్నమైంది. నిఖిల్ సిద్దార్థ 2025లో స్వయంభు థియేటర్లలోకి రాబోతుంది. పవర్ఫుల్ ఎపిక్ మ్యూజిక్‌ను ఆస్వాదించడం కోసం మిమ్మల్ని మీరు సిద్దం చేసుకోండి.. అంటూ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్వయంభు చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. స్వయంభులో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నట్టు మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లతో క్లారిటీ ఇచ్చేశారు.
కార్తికేయ ప్రాంఛైజీతో ఉత్తరాదిన సూపర్ ఫేం సంపాదించిన నిఖిల్ టీంతో రవిబస్రూర్ కలిసి పనిచేస్తుండటంతో స్వయంభుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
రవి బస్రూర్ స్టూడియోలో నిఖిల్ టీం..
Team #Swayambhu visits the Pan Indian Music Sensation @RaviBasrur studio in Basroor, Karnataka along with Ace lyricist @ramjowrites for the Music sittings 🎶💥
Brace yourself for the EPIC , powerful music that will Enthrall you ❤️🔥#Swayambhu in theatres 2025 ❤️🔥@actor_Nikhil… pic.twitter.com/cJKmRd6Gwl
— BA Raju’s Team (@baraju_SuperHit) January 8, 2025
Oscars 2025 | ఆస్కార్స్ 2025.. ఉత్తమ చిత్రం కేటగిరీలో ఐదు భారతీయ సినిమాలివే..!