Oscars 2025 | 97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్ (Oscars 2025)కు కేవలం రెండు నెలల సమయం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్లకు అర్హత సాధించిన 323 చలన చిత్రాల జాబితాను ప్రకటించింది. వీటిలో 207 సినిమాలు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ చిత్రం కేటగిరీలో అర్హత సాధించాయి. ఈ జాబితాలో ఐదు భారతీయ సినిమాలు అర్హత సాధించడం విశేషం.
భారతీయ సినిమాల జాబితా:
కంగువ (తమిళం)
ఆడుజీవితం (ది గోట్ లైఫ్)-హిందీ
సంతోష్ (హిందీ)
స్వతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ)
All We Imagine as Light ( మలయాళం-హిందీ)
Girls will be Girls (హిందీ-ఇంగ్లీష్)
ఈ నామినేషన్లకు ఓటింగ్ రేపటి నుంచి షురూ కానుంది. ఈ ప్రక్రియ జనవరి 12 వరకు ముగియనుంది. అకాడమీ ఫైనల్ నామినేషన్స్‌ను జనవరి 17న ప్రకటించనుంది. 97వ ఆస్కార్ అవార్డ్ ఈవెంట్-2025 మార్చి 2న Ovation Hollywoodలోని డాల్బీ థియేటర్లో జరుగనుంది. మరి ఈ జాబితా నుంచి ఏ సినిమా అయినా ఫైనల్ నామినేషన్లో చోటు సంపాదించుకుంటుందా..? అని భారతీయ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#KANGUVA : Enters #Oscars2025 Race & it’s One Amonv 323 Global Contenders For Best Picture at 96th Academy Awards🤯🔥#Suriya | #DSP | #SiruthaiSiva pic.twitter.com/LxKJN2PamD
— Saloon Kada Shanmugam (@saloon_kada) January 7, 2025