Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో కూలీ (Coolie)సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఇవాళ తలైవా థాయ్‌లాండ్‌కు పయనమయ్యాడు. ఈ సందర్భంగా చెన్నై ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు తలైవా. కూలీ 70 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పాడు. అంతేకాదు నెక్ట్స్ షెడ్యూల్ జనవరి 13న మొదలు కానుందని.. ఈ షెడ్యూల్ జనవరి 28 వరకు కొనసాగుతుందన్నాడు.
ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్ షూట్ షెడ్యూల్లో భాగంగా సంబార్ లేక్ ప్రాంతంలోఅమీర్ ఖాన్, ఉపేంద్ర, తలైవా, రెబా మోనికా జాన్ అండ్ టీంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్టు వార్తలు వచ్చాయని తెలిసిందే. కూలీ చిత్రాన్ని 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో సత్యరాజ్, మహేంద్రన్, అక్కినేని నాగార్జున, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తు్ండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Superstar #Rajinikanth is Off to #Coolie Next Schedule..🔥
“70% of shoot is Over.. This schedule will happen from Jan 13 to Jan 28..
I’ve Already told that No more Political Questions.. Thankyou..”pic.twitter.com/sDbGG8kXA3— Laxmi Kanth (@iammoviebuff007) January 7, 2025
G2 | అడివిశేష్ జీ2 మిషన్‌లో జాయిన్ అయిన బేబిజాన్ నటి.. లొకేషన్ లుక్ వైరల్
Maharaja | చైనా బాక్సాఫీస్నూ వదలని విజయ్‌సేతుపతి.. మహారాజ అరుదైన రికార్డ్