Maharaja | కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి విడుదలై తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది మహారాజ (Maharaja). మక్కళ్ సెల్వన్ 50 (VJS50)గా వచ్చిన ఈ చిత్రానిక ఇకురంగు బొమ్మై ఫేం నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు.
మహారాజ గతేడాది నవంబర్‌లో చైనాలో 40 వేలకుపైగా స్క్రీన్స్‌లలో విడుదలైన విషయం తెలిసిందే. చైనా ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ Yi Shi Films అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా రిలీజ్ చేశాయి. అయితే చైనా బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తోంది మహారాజ. ఈ చిత్రం చైనాలో రూ.91.55 కోట్లు వసూళ్లు చేసింది. ఈ ఫిగర్‌తో చైనాలో2018 నుంచి అత్యధిక గ్రాస్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా మహారాజ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.
ఈ విషయాన్ని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి యు జింగ్ అధికారికంగా తెలియజేస్తూ ట్వీట్ చేశారు. చైనాలో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలైన భారతీయ సినిమాగా మహారాజ నిలిచింది. గతేడాది జూన్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన మహారాజ 28 రోజుల థియాట్రికల్ రన్ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి జులై 12న ఎంట్రీ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
Maharaja has become the highest-grossing Indian film in China since 2018, reaching Rs 91.55 crore. Well done👍👍 pic.twitter.com/sq9SUY8D5F
— Yu Jing (@ChinaSpox_India) January 5, 2025
Game Changer | గేమ్ ఛేంజర్‌లో ఈవెంట్లో విషాదం.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన దిల్ రాజు
Nara Brahmani | మణిరత్నం సినిమాకి బాలకృష్ణ కూతురు ఎందుకు నో చెప్పిందంటే.?