Unstoppable with NBK | టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం డాకు మహరాజ్ (Daaku Maharaaj). ఈ సినిమాకు బాబీ (KS Ravindra) దర్శకత్వం వహిస్తుండగా.. అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable with NBK)షోకి డాకు మహరాజ్ టీం నుంచి దర్శకుడు బాబీ నిర్మాత వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వచ్చి సందడి చేశారు. అయితే ఈ షోలో థమన్ అడిగిన పలు ప్రశ్నలకు బాలయ్య సమాధానమిచ్చారు. ‘మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు?’ అని థమన్ బాలయ్యని అడుగగా..
బాలయ్యా సమాధానమిస్తూ.. నా ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్వినిలను తాను గారాబంగా పెంచానని అయితే తాను బ్రాహ్మణికి ఎక్కువగా భయపడతానని తెలిపారు. అయితే బ్రాహ్మణికి మణిరత్నం నుంచి ఒక సినిమా ఆఫర్ కూడా వచ్చిందని ఆయన తెలిపాడు. అయితే మణిరత్నం ఇచ్చిన ఆఫర్‌ని బ్రాహ్మణి రిజెక్ట్ చేసిందని చెప్పుకోచ్చారు. తనకు సినిమాలంటే అసలు ఆసక్తి లేదని అందుకే నో చెప్పిందని తెలిపాడు. అయితే నా చిన్న కూతురు తేజస్విని అయిన హీరోయిన్గా రాణిస్తుందని అనుకున్నాను కానీ ఆమె కేవలం అద్దంలో చూసుకుంటూ నటించేదని చెప్పుకోచ్చాడు బాలయ్య. ఇక నా తర్వాత సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి అంటే బ్రాహ్మణికి చాలా ఇష్టమని బాలయ్య చెప్పుకోచ్చాడు.