Shankar | శంకర్ (Shankar) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్ (Game Changer). బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన గేమ్ ఛేంజర్ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడిన మాటలు అందరిలో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఫైనల్‌గా ప్రేక్షకులను సీట్లకు అతుక్కునిపోయేలా చేసే శక్తి కంటెంట్‌కు మాత్రమే ఉంటుంది. సినిమాలో కథ లేకపోతే ఎలివేషన్‌తో ఎలాంటి ఉపయోగం ఉండదు. సినిమా విషయానికొస్తే మంచి కథను ఏదీ బీట్ చేయలేదు.. చెడ్డ కంటెంట్‌ను ఏదీ సపోర్ట్ చేయదు. నేను పలు ప్రాంతాల్లో ముధల్వన్ (ఒకేఒక్కడు) పాటలను షూట్ చేసినప్పటికీ.. కేవలం కంటెంట్ మాత్రమే టాప్ ప్లేస్‌ను ఆక్రమించిందంటూ ఓ ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు..
కడుపునిండా వంద ముద్దలు తిన్న ఏనుగు ఒక ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికొచ్చే నష్టమేం లేదు. కానీ అది లక్ష చీమలకు ఆహారం నేను మిమ్మల్ని అడిగేది కూడా కేవలం ఆ ఒక్క ముద్ద మాత్రమే.. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదంటూ ట్రైలర్లో వచ్చే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేసేలా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ ట్రైలర్..
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్