Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్
Shankar | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను లాంచ్ చేయగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
Shankar | గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను లాంచ్ చేయగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో దూసుకెళ్తోంది. కాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శంకర్ మాట్లాడిన మాటలు అందరిలో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
ఇది Shankranthi అంటున్నారు.. కాదు.. రామ నవమి అని అన్నాడు శంకర్ (Shankar). అందరూ సంక్రాంతి ముందుందని అనుకుంటున్నారు. కానీ అది రామ్ నవమి కాబోతోందంటూ సినిమా ఎలా ఉండబోతుందో శంకర్ హింట్ ఇచ్చేశాడు. ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ.. సినిమాలో రాంచరణ్ అద్భుతంగా నటించాడు. సినిమాలో మీరు స్టార్‌ను కాదు.. పాత్రను మాత్రమే చూస్తారు. రాంచరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే జనాలు థియేటర్లకు వస్తారని భావిస్తున్నాను. చరణ్ ప్రతీ ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా కనిపిస్తున్నాడు. రాంచరణ్ డిఫరెంట్ అవతారాల్లో కనిపించనున్నాడు.
గేమ్‌ఛేంజర్‌లో ఐఎఎస్ పాత్ర కోసం గడ్డం లేని చిన్న హెయిర్‌స్టైల్‌ని కోరుకున్నాము. నేను అడిగిన ప్రతీ విషయాన్ని చేయడానికి చరణ్ ఒప్పుకున్నాడు. ఇక అప్పన్న పాత్ర గేమ్ ఛేంజర్‌కు గుండెకాయలాంటిది. సినిమా అంతా ఆంధ్రా సంస్కృతి ఉండేలా చూసుకున్నాం. ఆంధ్రా సంస్కృతిని తెరపైకి తీసుకురావడంలో ఆర్ట్ డైరెక్షన్ టీమ్ అద్భుతంగా పని చేసింది. రేసీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు..
కడుపునిండా వంద ముద్దలు తిన్న ఏనుగు ఒక ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికొచ్చే నష్టమేం లేదు. కానీ అది లక్ష చీమలకు ఆహారం నేను మిమ్మల్ని అడిగేది కూడా కేవలం ఆ ఒక్క ముద్ద మాత్రమే.. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదంటూ ట్రైలర్లో వచ్చే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేసేలా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
గేమ్ ఛేంజర్ ట్రైలర్..
Read Also :
SSMB 29 | అడ్వెంచర్‌కు అంతా సిద్ధం.. నేడు రాజమౌళి, మహేష్ సినిమాకు కొబ్బరికాయ!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

