Keerthy Suresh | ‘మహానటి’ సినిమాతో తెలుగుతోపాటు తమిళంలోనూ సూపర్ ఫేం సంపాదించుకుంది నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh). తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ (Antony Thattil)ను కీర్తి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల గోవాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంటోనీతో తన ప్రేమబంధాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కీర్తి సురేశ్.
12వ తరగతి చదువుతున్నప్పుడే తాను ఆంటోనీతో ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చింది. తన కంటే ఆంటోనీ ఏడేళ్లు పెద్ద అని.. 15 ఏళ్ల నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నట్లు తెలిపింది. తొలిసారి 2010లో ఆంటోనీ తనకు ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. 2016 నుంచి ఇద్దరి బంధం మరింత బలపడిందని.. తనకు ఆంటోనీ ప్రామిస్ రింగ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. పెళ్లి చేసుకునే వరకూ ఆ రింగ్‌ను తీసేయలేదని చెప్పింది. తాను నటించిన సినిమాల్లో కూడా ఆ రింగ్‌ను గమనించొచ్చని పేర్కొంది.
‘మేమిద్దరం వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతాం. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నా.. పెళ్లి ఫిక్స్ అయ్యే వరకూ మా ప్రేమ విషయం సీక్రెట్‌గానే ఉంచాలని నిర్ణయించుకున్నాం. నేను ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు నా స్నేహితులు, ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రే తెలుసు. సమంత, విజయ్, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్ వంటి వారికి మాత్రమే మా ప్రేమ గురించి తెలుసు. 2017లో మేమిద్దరం మొదటిసారి విదేశాలకు కలిసి వెళ్లాం. 2022లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. 2024 డిసెంబర్లో ఒక్కటయ్యాం. ఆంటోనీ నా కెరీర్‌కు చాలా సపోర్ట్ ఇస్తాడు. తను నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం’ అని తన ప్రేమ కథను వివరించింది ఈ మహానటి.
Also Read..
“Keerthy Suresh | కల్యాణ వేళ.. ఆనంద హేల.. వివాహబంధంలోకి కీర్తి సురేష్.. Photos”
“Keerthy Suresh | క్రైస్తవ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్.. ఆంటోనీతో లిప్‌లాక్..!”
“Keerthy Suresh | కీర్తిసురేశ్ దంపతులతో విజయ్.. ట్రెండింగ్‌లో వెడ్డింగ్ గ్లింప్స్”
“Keerthy Suresh | తగ్గేదే లే.. బేబిజాన్ ప్రమోషన్స్‌లో మంగళసూత్రంతో కీర్తిసురేశ్”
“Keerthy Suresh | వివాహబంధంతో ఒక్కటైన కీర్తిసురేశ్-ఆంథోని తటిల్.. ఫొటోలు వైరల్”
“Keerthy Suresh | ఆంటోనితో పెళ్లి.. అప్డేట్ ఇచ్చిన కీర్తి సురేశ్”
“Keerthy Suresh | కృతి కాదు కీర్తి.. ఫొటోగ్రాఫర్లపై దసరా భామ ఆగ్రహం”
“Keerthy Suresh | తనవల్లే ఆ అవకాశం వచ్చిందంటూ.. సమంతకు థ్యాంక్స్ చెప్పిన కీర్తి సురేశ్”