Keerthy Suresh | బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ (Varun Dhawan) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం బేబీ జాన్ (Baby John). నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది కీర్తిసురేశ్. Kalees డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది బేబిజాన్ టీం.
కాగా కీర్తిసురేశ్ ఇటీవలే ఆంథోని తటిల్(Anthony Thattil)తో వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వెడ్డింగ్ తర్వాత కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పక్కా ప్రొఫెషనల్‌గా కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. రెడ్ డ్రెస్‌లో టీంతో కలిసి కనిపించగా.. మెడలో మంగళసూత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి పెళ్లి తర్వాత కూడా సినిమాల విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటూ చెప్పకనే చెబుతోందంటున్నారు నెటిజన్లు, అభిమానులు, ఫాలోవర్లు. అంతేకాదు పెళ్లి తర్వాత వస్తున్న హిందీ డెబ్యూ సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నారు.
The entire cast of #BabyJohn #VarunDhawan #KeerthySuresh #WamiqaGabbi
— Kuldeep Sharma (@Kuldeepsharmap) December 19, 2024
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?