Vijay Sethupathi | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ స్టార్ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం విడుదల పార్ట్ 2 (Vidudhala Part 2). కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మక్కళ్ సెల్వన్ టీం ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేసింది. కాగా సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి.. లీడ్ రోల్లో డైరెక్ట్‌గా తెలుగు సినిమా మాత్రం చేయలేదు. ప్రమోషన్స్ సందర్భంగా విజయ్ సేతుపతి లీడ్ రోల్లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
టాలీవుడ్ దర్శకులు సిద్దం చేసిన కథలను వింటున్నానని.. తెలుగు సినిమా డెబ్యూకు అవకాశముందని హింట్ ఇచ్చేశాడు. టాలీవుడ్ డెబ్యూపై స్పందిస్తూ.. నేను అదే పనిలో ఉన్నా. త్వరలోనే అది జరుగవచ్చన్నాడు విజయ్ సేతుపతి. ఇప్పుడీ కామెంట్స్‌తో అభిమానులు, మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే నిజమైతే మరి విజయ్ సేతుపతిని తెలుగులో ఎలివేట్ చేసే ఆ దర్శకుడెవరన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగా విడుదల పార్ట్ 2లో సూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. మంజు వారియర్ (Manju Warrier) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Laila | ఎంటర్టైనింగ్ బ్లాస్ట్.. లైలాగా విశ్వక్సేన్ థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్
Nani | ట్రెండింగ్‌లో నాని నయా లుక్.. ఇంతకీ ఏ సినిమా కోసమో..?
Manchu Mohan Babu | మోహన్ బాబుకు ఈ నెల 24 వరకు సమయం ఇచ్చాం: రాచకొండ సీపీ