Manchu Mohan Babu | మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. చట్టప్రకారమే అంతా జరుగుతుందని ఆయన వెల్లడించారు. మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచు ఫ్యామిలీ వివాదంపై ఇప్పటివరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరికొన్ని ఫిర్యాదులకు సంబంధించి మేము కేసు నమోదు చేయకముందే వచ్చి మరిన్ని వివరాలు చెబుతాం అని వెల్లడించారు. ముంచు ఫ్యామిలీకి సంబంధించిన కేసులో ప్రస్తుతం విచారణ జరుగుతుంది.
మోహన్ బాబును విచారించే సమయంలో మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. అయితే మోహన్ బాబు విచారణకు డిసెంబర్ 24 వరకు సమయం కావాలని కోరాడు. దీంతో ఈ నెల 24 వరకు అతడికి టైం ఇచ్చాం. ఈ నెల 24 అనంతరం ఒకవేళ విచారణకు అతడు హాజరు కాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుంది. మోహన్ బాబు వద్ద రెండు వెపన్స్ ఉన్నట్లు తెలిసింది. అయితే ఆ గన్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో లేవు. దీంతో ఆయన గన్ను చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో డిపాజిట్ చేశారు. ఇప్పటికే ఈ విషయంలో మంచు మనోజ్‌తో పాటు విష్ణుని పిలిపించి మాట్లాడం.. ఇద్దరితో కలిసి బాండ్ రాయించుకున్నాం. ఈ ఫ్యామిలీ వలన శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు ఉండనున్నట్లు సీపీ వెల్లడించారు.