Upendra Vs Vetrimaaran | యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న స్టార్ సెలబ్రిటీ ఉపేంద్ర (Upendra). ఇక సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetri Maaran). ఈ ఇద్దరు త్వరలోనే బాక్సాఫీస్ వద్ద పోరుకు రెడీ అవుతున్నారు.
వెట్రిమారన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లీడ్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ విడుదల పార్ట్ 2 (Vidudhala Part 2). డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కథనందిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యూఐ’ (UI The Movie). రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ మూవీ కూడా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉపేంద్ర, వెట్రిమారన్ టీం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు ఒక్క చోట చేరి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. రెండు సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు.
ఇప్పుడీ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఒకటి కన్నడ నుంచి తెలుగులో.. మరొకటి తమిళం నుంచి తెలుగులో విడుదల అవుతున్న నేపథ్యంలో.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ క్రేజీ సినిమాల మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందనే దానిపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
The visionaries behind the cinema we celebrate today ❤️🔥@nimmaupendra & @Dir_Vetrimaaran get clicked during their respective Post Production works 🔥
December 20th will be a BOX OFFICE BONANZA! 🤘🏼#UiTheMovie #viduthalaipart2#UiTheMovieOnDec20th pic.twitter.com/fg9eqiqHXb
— BA Raju’s Team (@baraju_SuperHit) December 17, 2024
Dacoit | అవును వదిలేసాను కానీ అంటున్న మృణాల్ ఠాకూర్.. అడివి శేష్ డెకాయిట్ లుక్ వైరల్
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?
Suman | హీరోలకు ఇదొక హెచ్చరిక.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సుమన్