Keerthy Suresh | ‘మహానటి’ సినిమాతో తెలుగుతోపాటు తమిళంలోనూ సూపర్ ఫేం సంపాదించుకుంది నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh). తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వరుణ్ ధావన్‌తో కలిసి ‘బేబీ జాన్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ‘బేబీ జాన్’ చిత్రంలో అవకాశం గురించి మహానటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. స్టార్ నటి సమంత (Samantha) కారణంగానే తనకు ‘బేబీ జాన్’ (Baby John) చిత్రంలో నటించే గొప్ప అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు సామ్‌కు థ్యాంక్స్ చెప్పింది.
‘బేబీ జాన్’ చిత్రం ‘తెరి’ సినిమాకు రీమేక్‌గా రూపొందించిన విషయం తెలిసిందే. దీని తమిళ వెర్షన్లో హీరోయిన్గా సామ్ నటించింది. ఈ చిత్రం హిందీ రీమేక్ చేయాలని భావించిన చిత్ర బృందం సమంతను సంప్రదించగా.. సామ్ తన పేరును సూచించిందని కీర్తి సురేశ్ తాజాగా వెల్లడించింది. తమిళంలో సమంత పోషించిన పాత్రను హిందీలో తాను చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని పేర్కొంది. ఈ సినిమా కోసం సమంత తన పేరు చెప్పగానే తాను భయపడ్డానని… అయితే సమంత తనకు ఎంతో మద్దతు ఇచ్చిందని పేర్కొంది. సమంత ఇచ్చిన ధైర్యంతోనే సినిమాను పూర్తి చేశానని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో సమంతకు కీర్తి సురేశ్ కృతజ్ఙతలు తెలిపింది.
Also Read..
Unstoppable with NBK | బాలయ్య అన్‌స్టాపబుల్ సెట్లో రామ్ చరణ్ సందడి.. వీడియోలు
Manchu Vishnu | మరో వివాదంలో ఇరుక్కున్న మంచు ఫ్యామిలీ.. సోషల్‌మీడియాలో వీడియో వైరల్
Nidhi Agarwal | 2025 లక్కీ ఇయర్.. ఇద్దరు సూపర్స్టార్లతో నిధి అగర్వాల్