Unstoppable with NBK | నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సూపర్ హిట్ టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ (Unstoppable with NBK). ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో నాలుగో సీజన్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటికే పలువురు స్టార్స్ సందడి చేశారు. తాజాగా ఈ షోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా షో షూటింగ్లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ (Game Changer)తో ఇండస్ట్రీకి గ్రాండ్ సక్సెస్ ఇవ్వబోతున్నాం’ అంటూ బాలకృష్ణ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Two BIGGEST Legacy Carriers of TFI 🤩🔥#UnstoppableWithNBK #RamCharan𓃵 #DaakuMaharaajOnJan12th #ramcharan #balayya pic.twitter.com/Rik2DTVZFJ
— PSPKesav (@Pspkesav_Arts) December 31, 2024
నాలుగో సీజన్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అల్లు అర్జున్, తమిళ నటుడు సూర్యలతో పాటు నవీన్ పొలిశెట్టి, వెంకటేశ్ తదితరులు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సురేశ్ బాబు వంటి వారు కూడా పాల్గొని వారి సినిమా ప్రమోషన్ చేశారు. ఇప్పుడు చరణ్ సందడి చేయబోతున్నారు. ఇది తెలుసుకున్న మెగా అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
#gamechanger for #UnstoppablewithNBKS4 #RamCharan𓃵 ultimate stylish look pic.twitter.com/3l1Zz57y6o
— Anchor sharath (@AnchorSharath96) December 31, 2024
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దిగ్గజ దర్శకుడు శంకర్(Shankar) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ఇక, నందమూరి బాలకృష్ణ (Balakrishna) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఎన్బీకే 109 (NBK109)గా తెరకెక్కుతున్న ఈ మూవీకి బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నాడు. ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Also Read..
Manchu Vishnu | మరో వివాదంలో ఇరుక్కున్న మంచు ఫ్యామిలీ.. సోషల్మీడియాలో వీడియో వైరల్
Nidhi Agarwal | 2025 లక్కీ ఇయర్.. ఇద్దరు సూపర్స్టార్లతో నిధి అగర్వాల్