Ponnam Prabhakar | మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మధ్య గుజరాత్ వెళ్లినప్పుడు అక్కడ పాల సేకరణ గ్రామీణ స్థాయి నుండి జరుగుతుంది.. అక్కడ అమూల్ పాలు దేశ వ్యాప్తంగా వ్యాపించాయన్నారు. ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని తుమ్మల నాగేశ్వరరావు స్టార్ట్ చేశారు.
ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని బావిస్తున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గతంలో ప్రతిపాదనలు జరిగినప్పటికీ రూ.300 కోట్లు కేటాయించి తుమ్మల నాగేశ్వరరావు పనులు పూర్తి చేయించారు. ఈ ప్రాంత రైతాంగానికి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఈ ప్రాంత రైతులు ఆయిల్ పామ్‌పై దృష్టి సారించాలి.. మా ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పంట పండదు అనే అపోహ నుండి తుమ్మల బయటకు తీసుకొచ్చారు. ఇక్కడి రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలనీ ఈ ప్రాంత రైతులను కోరుతున్నారు.. ఈ ఆయిల్ ఫ్యాక్టరీకి రూపం తెచ్చిన మంత్రి తుమ్మలకు ధన్యవాదాలు తెలియజేశారు.
Poorna | పూర్ణ ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి.. రెండోసారి తల్లైన టాలీవుడ్ నటి
Seasonal Allergies | సీజన్ మారుతోంది.. ఈ సమయంలో వచ్చే అలర్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
Uttar Pradesh | కెరీర్‌పై ఫోకస్ చేయమన్నందుకు కవల సోదరి హత్య.. 84 సార్లు కత్తితో పొడిచి చంపిన సోదరుడు