BCCI: రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్, మిథాలీ రాజ్‌కు లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు
BCCI : రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్, మిథాలీ రాజ్‌లను లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుతో సన్మానించనున్నారు. ఢిల్లీలో ఆదివారం ఈ కార్యక్రమం జరగనున్నది. ఇటీవల కాలంలో అయిదు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న టీమిండియా జట్లను కూడా ఈ సందర్భంగా సత్కరించనున్నారు.
ముంబై: 2026 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన సూర్యకుమార్ నేతృత్వంలోని భారత బృందాన్ని బీసీసీఐ(BCCI) సన్మానించనున్నది. ఆదివారం జరిగే నమన్ అవార్డు ప్రదానోత్సవంలో సన్మాన కార్యక్రమం ఉండనున్నది. ఇటీవల ఐసీసీ టోర్నీల్లో అయిదు టైటిళ్లు గెలిచిన భారత జట్లను నమన్ అవార్డులతో సన్మానించనున్నారు. ఈ విషయాన్ని ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. మార్చి 8వ తేదీన జరిగిన ఫైనల్లో సూర్య కుమార్ నేతృత్వంలోని భారత జట్టు టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సూర్య బృందంతో పాటు 2025లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన మహిళల జట్టు, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పురుషుల జట్టు, 2026 అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు, 2025 మహిళ అండర్19 వరల్డ్‌కప్ బృందాలను కూడా సత్కరించనున్నారు.
అనేక మంది క్రికెటర్లకు వ్యక్తిగత అవార్డలను కూడా ఇవ్వనున్నది. టెస్టు, వన్డే కెప్టెన్ గిల్‌కు పాలీ ఉమ్రిగర్ అవార్డును ఇవ్వనున్నారు. మహిళల్లో బెస్ట్ ఇంటర్నేషన్ క్రికెటర్ అవార్డును స్మృతీ మంధానాకు ఇవ్వనున్నారు. మాజీ క్రికెటర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్‌కు .. కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డును అందజేయనున్నారు. ఇక బీసీసీఐ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డును మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అందుకోనున్నారు. 1983లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడిగా ఉన్నారు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్నారు. అయితే 2022 నుంచి 2025 వరకు రోజర్ బిన్నీ కోచ్, సెలెక్టర్, బీసీసీఐ అధ్యక్షుడిగా చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో 24వేల రన్స్ చేసిన క్రికెటర్‌గా ద్రావిడ్‌కు గుర్తింపు ఉన్నది. 2024 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో భారత జట్టు కోచ్‌గా ద్రావిడ్ ఉన్నారు.
బెస్ట్ వుమెన్ డొమెస్టిక్ క్రికెటర్ కేటగిరీలో జగన్మోహన్ దాల్మీయా అవార్డును ఇరా జాదవ్‌కు ఇవ్వనున్నారు. సీనియర్ డొమెస్టిక్ వన్డే ఫార్మాట్లో బెస్ట్ వుమెన్ క్రికెటర్ అవార్డు షఫాలీ వర్మను వరించనున్నది. బెస్ట్ ఆల్‌రౌండర్‌కు ఇచ్చే లాల్ అమర్నాథ్ అవార్డును ఆయుష్ మాత్రేకు ఇవ్వనున్నారు. రంజీల్లో బెస్ట ఆల్‌రౌండర్ అవార్డు విదర్భ ప్లేయర్ హర్ష్ దూబేకు వెళ్లనున్నది.
🚨 News 🚨
BCCI to honour Roger Binny, Rahul Dravid and Mithali Raj with Lifetime Achievement Awards at Naman Awards 2026, scheduled to be held on Sunday, 15 March 2026, in New Delhi.
More details ▶️ https://t.co/noBSDbxcW5 pic.twitter.com/WfhfqHBuiI
— BCCI (@BCCI) March 14, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

