Manchu Vishnu | మరో వివాదంలో ఇరుక్కున్న మంచు ఫ్యామిలీ.. సోషల్‌మీడియాలో వీడియో వైరల్
Manchu Vishnu | మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య జరిగిన ఆస్తి వివాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించాయి. ఆ విషయాలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయనగా.. మంచు ఫ్యామిలీ మరో వివాదంలో ఇరుక్కుంది.
Manchu Vishnu | మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య జరిగిన ఆస్తి వివాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించాయి. ఆ విషయాలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయనగా.. మంచు ఫ్యామిలీ మరో వివాదంలో ఇరుక్కుంది. మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడటం ఇప్పుడు వైరల్‌గా మారింది.
హైదరాబాద్ జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్ చిట్ట అడవి పందులను వేటాడాడు. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకొచ్చాడు. అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్లు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ ప్రసాద్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని మంచు మనోజ్ తెలిపారు. వారిద్దరి చర్యలను తప్పుబడుతూ పలుమార్లు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశానని చెప్పారు. అయినప్పటికీ వారిద్దరూ పట్టించుకోకుండా ఇలాగే చేశారని చెప్పారు.
మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది.
జల్పల్లిలోని అడవిలో అడవి పందులను వేటాడిన మంచు విష్ణు సిబ్బంది
అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకెళ్లిన మేనేజర్ కిరణ్
వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ pic.twitter.com/FQmfix1OSD
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2024
ఇదిలా ఉంటే మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

