Keerthy Suresh | అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కీర్తి సురేష్ (Keerthy Suresh) తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. గోవాలో పెళ్లి జరుగుతుందని, త్వరలో అన్ని వివరాలను వెల్లడిస్తానని చెప్పింది.
అయితే, పెళ్లి డేట్ మాత్రం చెప్పలేదు ఈ ‘మహానటి’. అయితే, తమిళ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు కీర్తి సురేశ్ వివాహం ఈనెల 12న జరగనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పెళ్లి టైమ్ దగ్గరపడుతుండటంతో ఈ చెన్నై బ్యూటీ తాజాగా గోవా ఫ్లైట్ ఎక్కేసింది (Keerthy Suresh Jets Off To Goa). ఓ మేరకు అప్డేట్ ఇస్తూ బోర్డింగ్ పాస్‌లను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ #KAwedding అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
ఇక కీర్తి సురేష్‌ను పెళ్లాడబోతున్న ఆంటోని ఆమె కాలేజీ స్నేహితుడు. దాదాపు 15 ఏండ్లుగా వీరిమధ్య మంచి స్నేహసంబంధాలున్నాయి. ఇద్దరి కుటుంబాలు కూడా సన్నిహితంగా ఉంటాయని తెలిసింది. ఆంటోని కేరళలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, బేబీ జాన్ చిత్రాల్లో నటిస్తున్నది.
🌟 Wedding bells are ringing! 💒 #KeerthySuresh & #Antony’s love story reaches its beautiful destination on Dec 12th! ❤️
Stay tuned for every enchanting detail! #KeerthyAntonyWedding pic.twitter.com/ySARSVkHBD
— KLAPBOARD (@klapboardpost) December 4, 2024
Also Read..
Rajya Sabha | రాజ్యసభలో నగదు కలకలం.. తెలంగాణ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్ట
Repo Rate | వరుసగా 11వ సారి.. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ లేదు
Air Pollution | ఢిల్లీలో మెరుగుపడిన గాలి నాణ్యత.. ఆంక్షల సడలింపు