అనంతగిరి, మార్చి 13 : అనంతగిరి మండలంలోని వాయిలసింగవరంలో ఉపాధి హామీ నిధులు రూ.8 లక్షలతో రెండవ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధిపథంలో నిలుపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి సౌమ్య, వార్డు సభ్యురాలు బుర్రా భవానీ, మాజీ పిఏసిఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు గద్దె రఘు, కొల్లు సుబ్బారావు, చుండూరు మురళి, గుండ్లపల్లి వెంకన్న, దాములూరి మురళి, బుర్రా నాగమల్లేశ్వరరావు, నేరెళ్ల నాగేశ్వరరావు, మేళ్లచెర్వు భిక్షం, కంటు వేణు పాల్గొన్నారు.