Mirchi farmer | కాంగ్రెస్ హయాంలో రైతులు ఓ వైపు నీళ్ల కోసం ఎదురుచూపులు.. మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధరల కోసం వెతలు తప్పడం లేదు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు, మక్కలను అమ్ముకునేందుకు రైతులు నెలల తరబడి వేచి ఉండి తీవ్ర అవస్థలు పడ్డారని తెలిసిందే. ఈ బాధలు మిర్చి రైతులను కూడా చుట్టుముట్టాయి.
వ్యవసాయ మార్కెట్ ఎదుట మిర్చి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. తాము అమ్మిన మిర్చి డబ్బులు చెల్లించాలని ఓ రైతన్న వ్యవసాయ మార్కెట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన తోటి రైతులు, మార్కెట్ చైర్మన్ సదరు రైతును అడ్డుకున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలియజేసేందుకు ఈ వీడియో మరోసారి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది.
వ్యవసాయ మార్కెట్ ఎదుట మిర్చి రైతు ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట తాము అమ్మిన మిర్చి డబ్బులు చెల్లించాలని, ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు
అడ్డుకున్న మార్కెట్ చైర్మన్, ఎస్ఐ, తోటి రైతులు pic.twitter.com/ErSoYaUu4s
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026