Repo Rate | వడ్డీ రేట్ల (Repo Rate) విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతున్నట్లు స్పష్టం చేసింది. వరుసగా 11వ సారి కూడా రెపో రేటు (Repo Rate)ను 6.5 శాతంగానే ఫిక్స్ చేసింది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ఇవాళ వెల్లడించారు.
రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ద్రవ్యోల్పణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కూడా వడ్డీరేట్లలో మార్పులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాగా, 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటును ఇలాగే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి.
Also Read..
RAPO 22 | కాలుతో సైకిల్ స్టాండ్ వేస్తున్న రామ్.. ఆసక్తి రేకెత్తిస్తోన్న రాపో 22 ఫస్ట్ లుక్
Vitamin E Foods | నట్స్, సీడ్స్లోనే కాదు.. విటమిన్ ఇ ఈ పండ్లు, కూరగాయల్లోనూ ఉంటుంది..!