RAPO 22 | డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తర్వాత సినిమాల ఎంపికలో రూటు మార్చేశాడు రామ్ పోతినేని (Ram Pothineni). ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్న రామ్ కంప్లీట్ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు (Mahesh Babu P) దర్శకత్వంలో రామ్ (Ram Pothineni) నటిస్తోన్న తాజా చిత్రం రాపో 22 (RAPO 22). మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది.
మీకు సుపరిచితుడు.. మీలో ఒకడిని పరిచయం చేస్తామని మేకర్స్ చెప్పారని తెలిసిందే. తాజాగా అందరిలో ఒకడు రామ్ పాత్రను పరిచయం చేశారు. చేతిలో నోట్‌బుక్ పట్టుకుని కాలుతో సైకిల్ స్టాండ్ వేస్తున్న రామ్ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ రామ్ ఈ చిత్రంలో స్టూడెంట్‌గా కనిపించబోతున్నాడా..? లేదంటే టీచర్‌గా మారి పాఠాలు చెప్పబోతున్నాడా.. ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఈ మూవీలో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల ద్వయం వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. మేరిక్రిస్మస్, మలైకొట్టై వాలిబన్ ఫేం సినిమాటోగ్రఫర్ మధు నీలకందన్ ఈ సినిమాకు పని చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. నేషనల్ అవార్డు విన్నింగ్ టెక్నీషియన్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నాడు.
రాపో 22 ఫస్ట్ లుక్..
When you know him, you will see yourself in him.
Meet @ramsayz as ‘SAGAR’ from #RAPO22 ❤️🔥
He will soon bring an ocean of great cinema moments to the big screens. Shoot begins ✨@bhagyasriiborse @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon @sreekar_prasad… pic.twitter.com/jHGEd6UO1F
— BA Raju’s Team (@baraju_SuperHit) December 6, 2024
Rashmika Mandanna | రష్మిక మందన్నా ఏంటీ సంగతి..? విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఏఎంబీ మాల్లో..
Fahadh Faasil | ఎక్జయిటింగ్ అనిపించిందే చేశానంటున్న పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్