Pushpa 2 The Rule | సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన మోస్ట్ ఎవెయిటెడ్ సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) . తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై పుష్ప 2 ది రూల్ అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. అల్లు అర్జున్ (Allu Arjun) వన్ మ్యాన్ షోలా సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది.
ట్రేడ్ సర్కిల్ కథనాల ప్రకారం ఓపెనింగ్ డేన నైజాం ఏరియాలో ఈ చిత్రం రూ.30 కోట్లు షేర్ రాబట్టింది. ఈ పాన్ ఇండియా డ్రామా ఇప్పటివరకు నైజాం ఏరియాలో (రూ.23.38 కోట్లు) ఉన్న ఆర్ఆర్ఆర్ (RRR)మార్జిన్‌ను అధిగమించేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ట్రేడ్ ఎనలిస్టుల కథనాల ప్రకారం పుష్ప 2 ఓపెనింగ్ వీకెండ్ ముగిసేనాటికి రూ.75 కోట్ల క్లబ్‌లోకి సులభంగా ఎంటరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇంకేంటి మరి పుష్ప 2 రానున్న రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నింటిని చెరిపేస్తుందేమో చూడాలంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఇప్పటికే అభిమానుల డిమాండ్ మేరకు ముంబై, థానే, పూణే, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి ప్రధాన నగరాల్లోమిడ్నైట్ షోల (11.55 pm / 11.59 pm)ను కూడా యాడ్ చేశారని వార్తలు వచ్చాయని తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Rashmika Mandanna | రష్మిక మందన్నా ఏంటీ సంగతి..? విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఏఎంబీ మాల్లో..
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?