Ram Gopal Varma | ఏదో ఒక కామెంట్‌తో నెటిజన్లను ఓ వైపు ఆలోచింపజేస్తూనే.. మరోవైపు కొంత అయోమయానికి గురి చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటాడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma). ఈ క్రేజీ డైరెక్టర్ నెట్టింట ఏది పోస్ట్ చేసినా అది ట్రెండింగ్ టాపిక్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప 2 రిలీజ్‌కు ముందు రోజు డిసెంబర్ 4న బెనిఫిట్ షో వేసుకునేందకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. ప్రతీ టికెట్ ధర రూ.800 (జీఎస్టీ లేకుండా)కు పెంచుకునేందుకు అవకాశమిచ్చాయి.
సమకాలీన పరిస్థితులపై తనదైన శైలిలో ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే వర్మ ఇప్పుడు పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) ధరల పెంపుపై నెట్టింట జరుగుతున్న చర్చ నేపథ్యంలో పుష్ప 2 ఇడ్లీలు.. అంటూ ఓ కథను షేర్ చేస్తూ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. సుబ్బారావు అనే వ్యక్తి ఒక ఇడ్లీ హోటల్ పెట్టి.. ప్లేట్ ఇడ్లీల ధరను రూ.1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావారి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.
కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, అతను సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దీని వల్ల నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు. ‘సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే.. అది సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనం’.. అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు..?
వినోదం (ఎంటర్టైన్మెంట్) నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా?.. వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఎక్కువ రేట్ పెట్టి సినిమా చూడటం అనేది పర్సనల్ ఛాయిస్. మరి దీనిపై నెటిజన్లు, మూవీ లవర్స్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.
పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2
సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.
కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు…
— Ram Gopal Varma (@RGVzoomin) December 4, 2024
They Call Him OG | ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. ట్విటర్‌లోకి ఓజీ డైరెక్టర్ గ్రాండ్ ఎంట్రీ