Sukumar | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడిన మాటలు అభిమానులను భావోద్వేగానికి లోను చేయడమే కాదు.. మరోవైపు జోష్ కూడా నింపాయి. అల్లు అర్జున్‌తో నా ప్రయాణం ఆర్యతో మొదలైంది. వ్యక్తిగా, నటుడిగా తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ.. వచ్చా. పుష్ప చిత్రాలు ఇలా తయారయ్యాయంటే కారణం తనపై నాకున్న ప్రేమేనన్నాడు సుకుమార్ . హీరో సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడంటే.. సెట్లో ఉన్న ప్రతీ ఒక్కడికి ఎనర్జీ వస్తది.
అల్లు అర్జున్ మైత్రీ మూవీ మేకర్స్‌తోపాటు అందరికీ ఒక ప్లాట్‌ఫాం క్రియేట్ చేశాడు. ఆ హైట్‌లోనే మేమంతా పనిచేయాల్సి వస్తుంది. ఇది కథ కాదు.. సినిమా కాదు.. రాయడం కాదు.. ఇది నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేం లేదు.. డార్లింగ్ అంటూ అల్లు అర్జున్ పట్ల తనకున్న అనుబంధాన్ని, ప్రేమను, స్నేహాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు సుకుమార్.
పుష్ప 3 సినిమా గురించి ప్రేక్షకులంతా అరుపులు, కేకలతో అడగగా.. నేను మీ హీరోను దాదాపు 2-3 సంవత్సరాలు కష్టపెట్టాను. ఓ వ్యక్తి లైఫ్‌లో నుంచి మూడేళ్లు తీసుకున్నానంటే.. మీరు మీ హీరోను నాకోసం ఇంకో మూడేళ్లు ఇవ్వగలిగే అవకాశముందా..? అని అడగండి. ఉందంటే ఆ తర్వాత పుష్ప 3 చేస్తానని చెప్పాడు. బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అని సుకుమార్ కామెంట్స్‌తో తెగ సంబరపడిపోతున్నారు మూవీ లవర్స్, అభిమానులు.
Read Also :
Allu Arjun | పుష్ప 2 ది రూల్‌కు సపోర్ట్.. ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ ధన్యవాదాలు
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట