Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట
Ram Gopal Varma |టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరుకాని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడని తెలిసిందే.
Ram Gopal Varma | ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన అంశంలో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరుకాని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడని తెలిసిందే.
తాజా ఈ కేసులో రాంగోపాల్ వర్మకు ఏపీలో హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం (ఈ నెల 9)వరకు వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసు పెడుతున్నారని ఆర్జీవీ తన పిటిషన్లో పేర్కొన్నారు. తాను కామెంట్ చేసిన వ్యక్తులు కాకుండా.. సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. తనపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా ఆదేశాలు జారీచేయాలని కోర్టుకు నివేదించాడు వర్మ.
పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తా..
వర్మ ఇప్పటికే మీడియాతో మాట్లాడుతూ..నేను పారిపోలేదు.. హైదరాబాద్‌లోని డెన్‌లో ఉన్నా. నాపై ఐదు కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉంది. నా రిప్లైపై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానన్నాడు. అరెస్ట్ చేస్తారనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. అభిప్రాయాలు తెలుసుకునేందుకు ట్వీట్లు పెట్టా. నా ట్వీట్ల వెనుక రాజకీయ దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. మరి దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
ఈ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కేసా? ఏడాది తర్వాత ట్వీట్ చూసిన అతనికి వారంలో అన్నీ అయిపోవాలనడంలో ఏమైనా అర్థం ఉంటదా అసలు.. హత్యకేసుల్లాంటి వాటికి సంవత్సరాలు తీసుకొని.. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసుల కంటే ముందే వీటిని విచారించడమేంటని తనదైన శైలిలో కౌంటర్ వేయగా.. ఇప్పటికే ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
Read Also :
Raja Saab | నా ఫేవరేట్ హీరో ప్రభాస్.. రాజాసాబ్ షూట్‌పై మాళవిక మోహనన్ ఆసక్తికర కామెంట్స్
Actress Sai Pallavi | నేను ఆ తప్పు చేయలేదు.. ఏడుస్తూ చెప్పిన నటి సాయిపల్లవి
Idly Kadai | ఇడ్లీకడైలో ధనుష్ లుక్ ఎలా ఉండబోతుందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

